దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కృత్రిమమేధ(ఏఐ) ఆధారిత జనరేషన్ డయల్ 112 సేవలను తెలంగాణ పోలీసులు ప్రారంభించారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో తెలంగాణ పోలీసు శాఖ నెక్స్ట్ జనరేషన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ (టీజీ- ఈఆర్‌ఎస్‌ఎస్) డయల్ 112ను అందుబాటులోకి తెచ్చింది. పోలీస్, అగ్నిమాపక, అంబులెన్స్, మహిళా భద్రత, బాలల రక్షణ, ప్రకృతి విపత్తుల నిర్వహణ సేవలన్నీ ఒకే జాతీయ నంబరు కిందకు తీసుకొచ్చారు. ఈ అత్యవసర సేవల విభాగాన్ని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ 2026, ఆగస్టు 5న ప్రారంభించారు.