Please note, our website will be undergoing scheduled maintenance on Monday, 25th November night from 11:00 PM to 3:00 AM IST (5:30 PM to 9:30 PM UTC) and will be temporarily unavailable. Sorry for the inconvenience.
విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ 2024-25 విద్యా సంవత్సరానికి వర్సిటీ పరిధిలోని కళాశాలల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద బీఎస్సీ పారామెడికల్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
కాంపిటెంట్ అథారిటీ కోటాలో బీఎస్సీ (పారామెడికల్ టెక్నాలజీ) డిగ్రీ కోర్సులు:
1. బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ
2. బీఎస్సీ న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ
3. బీఎస్సీ ఆప్టోమెట్రిక్ టెక్నాలజీ
4. బీఎస్సీ రీనల్ డయాలసిస్ టెక్నాలజీ
5. బీఎస్సీ పెర్ఫ్యూజన్ టెక్నాలజీ
6. బీఎస్సీ కార్డియాక్ కేర్ టెక్నాలజీ అండ్ కార్డియో వాస్క్యులర్ టెక్నాలజీ
7. బీఎస్సీ అనస్థీషియాలజీ టెక్నాలజీ అండ్ ఆపరేషన్ టెక్నాలజీ
8. బీఎస్సీ ఇమేజింగ్ టెక్నాలజీ
9. బీఎస్సీ ఎమెర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ
10. బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ
11. బీఎస్సీ ఫిజీషియన్ అసిస్టెంట్ టెక్నాలజీ
12. బీఎస్సీ మెడికల్ రికార్డ్స్ అసిస్టెంట్ టెక్నాలజీ
13. బీఎస్సీ ట్రాన్స్ఫ్యూజన్ టెక్నాలజీ
14. బీఎస్సీ రేడియోథెరపీ టెక్నాలజీ
15. బీఎస్సీ ఎకో-కార్డియోగ్రఫీ టెక్నాలజీ
వ్యవధి: నాలుగేళ్ల డిగ్రీ కోర్సు(రోటేటరీ ఇంటర్న్‌షిప్‌తో సహా).
అర్హత: ఇంటర్మీడియట్(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ) లేదా ఇంటర్ ఒకేషనల్ బ్రిడ్జ్ కోర్సు/ సార్వత్రిక విద్యలో ఇంటర్ (ఫిజికల్ సైన్సెస్/ బయోలాజికల్ సైన్సెస్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థులు 31 డిసెంబర్ 2024 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి లేదు.
దరఖాస్తు, ప్రాసెసింగ్ ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.2360, బీసీ/ ఎస్టీ/ ఎస్సీ అభ్యర్థులకు రూ.1888.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 09.12.2024
Website:https://drntr.uhsap.in/index/