జొహన్నెస్‌బర్గ్‌లో జీ20 సదస్సు 2025, నవంబరు 23న ముగిసింది. సదస్సుకు ఆతిథ్యమిస్తున్న దక్షిణాఫ్రికా, జీ20 కూటమి తరఫున ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేసింది. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని, అది ఏ రూపంలో ఉన్నా తెగనాడాల్సిందేనని జీ20 శిఖరాగ్ర సదస్సు తీర్మానం చేసింది.
కూటమి దేశాల్లో డిజిటల్ మౌలిక సదుపాయాలు మెరుగుపరచడంపై దృష్టి పెడతామని పేర్కొంది. ఏఐ సాంకేతికతలను అందిపుచ్చుకునే విషయంలో కలిసికట్టుగా పనిచేస్తామని, ఏఐతో తలెత్తే ముప్పును తగ్గించే చర్యలను సైతం ఐక్యంగానే చేపడతామని తెలిపింది.