జర్మనీ ఛాన్స్‌లర్‌గా మితవాద నేత ఫ్రెడరిక్ మెర్జ్ ఎన్నికయ్యారు. దేశ దిగువ సభ బుందెస్టాగ్‌లో 2025, మే 6న జరిగిన ఓటింగులో ఆయన విజయం సాధించారు. ఆనవాయితీ ప్రకారం జర్మనీ దేశాధ్యక్షుడు బుందెస్టాగ్‌లోని పార్లమెంటరీ పార్టీలన్నింటినీ సంప్రదించాక ఛాన్స్‌లర్ పదవికి అభ్యర్థిని ప్రకటిస్తారు. ఇలా ప్రకటించిన అభ్యర్థి బుందెస్టాగ్‌లోని మొత్తం 630 మంది సభ్యులకుగాను 316 మంది మద్దతు పొందాలి. ఈ ఎన్నిక రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుంది. ఈసారి అధ్యక్షుడు ఛాన్స్‌లర్ అభ్యర్థిగా ప్రకటించిన ఫ్రెడరిక్ మెర్జ్ తొలుత 310 ఓట్లే పొందగలిగారు. రెండోసారి జరిగిన ఓటింగులో ఆయన 325 ఓట్లు పొందారు.