Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Nov 16, 2026
Current Affairs
జపాన్‌ మాస్టర్స్‌ టైటిల్‌
జపాన్‌ మాస్టర్స్‌ టైటిల్‌
  • భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్య సేన్‌ జపాన్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. 2026, నవంబరు 15న కుమామోటోలో జరిగిన పురుషుల సింగిల్స్‌ తుది పోరులో లక్ష్య 13-21, 21-18, 21-14తో స్థానిక ఫేవరెట్‌ కొకి వతనబెను ఓడించాడు.

  • ఈ గెలుపుతో 2026 చివర్లో జరిగే బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీలో ఆడే అవకాశాన్ని లక్ష్య.. మరింత మెరుగుపరుచుకున్నాడు. జపాన్‌ టైటిల్‌ నెగ్గడంతో 9200 పాయింట్లు దక్కించుకున్న లక్ష్య.. మొత్తం 74180 పాయింట్లతో ఆరో ర్యాంకుకు చేరుకోనున్నాడు. టాప్‌-8లో ఉన్న ప్లేయర్లకే ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీలో ఆడే అవకాశం ఉంటుంది.