Published on Oct 30, 2024
Admissions
కాళోజీ హెల్త్‌ వర్సిటీలో బీపీటీ, బీఎస్సీ అనుబంధ హెల్త్‌ సైన్సెస్‌ డిగ్రీ కోర్సులు
కాళోజీ హెల్త్‌ వర్సిటీలో బీపీటీ, బీఎస్సీ అనుబంధ హెల్త్‌ సైన్సెస్‌ డిగ్రీ కోర్సులు

వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్- 2024-25 విద్యా సంవత్సరానికి బీపీటీ, బీఎస్సీ అనుబంధ హెల్త్‌ సైన్సెస్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు.

వివరాలు:

1. బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ

2. బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ

3. బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ

4. బీఎస్సీ కార్డియాక్ అండ్‌ కార్డియో వాస్కులర్ టెక్నాలజీ

5. బీఎస్సీ రెనల్‌ డయాలసిస్ టెక్నాలజీ

6. బీఎస్సీ ఆప్టోమెట్రీ

7. బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ

8. బీఎస్సీ న్యూరో సైన్స్ టెక్నాలజీ

9. బీఎస్సీ క్రిటికల్ కేర్ టెక్నాలజీ

10. బీఎస్సీ రేడియాలజీ అండ్‌ ఇమేజింగ్ టెక్నాలజీ

11. బీఎస్సీ అడియాలజీ అండ్‌ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ

12. బీఎస్సీ మెడికల్ రికార్డ్స్ సైన్సెస్

13. బీఎస్సీ న్యూక్లియర్ మెడిసిన్

14. బీఎస్సీ రేడియో థెరపీ టెక్నాలజీ

15. బీపీటీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ)

కోర్సు వ్యవధి: బీఎస్సీ ఎంఎల్‌టీ కోర్సుకు మూడేళ్లు; బీపీటీకి నాలుగేళ్లు, ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌; మిగిలిన కోర్సులకు నాలుగేళ్లు.

అర్హత: ఇంటర్మీడియట్(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ) లేదా ఇంటర్‌ ఒకేషనల్‌ బ్రిడ్జ్ కోర్సు/ సార్వత్రిక విద్యలో ఇంటర్‌ (ఫిజికల్ సైన్సెస్/ బయోలాజికల్ సైన్సెస్‌) ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: అభ్యర్థులు డిసెంబర్ 31, 2024 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి.

దరఖాస్తు రుసుము: ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.2500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.2000.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్ మార్కులు, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 29-10-2024 నుంచి 06-11-2024 వరకు.

Website:https://www.knruhs.telangana.gov.in/

Apply online:https://alliedhs.tsche.in/