ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకొని దేశంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడలను నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వీలుగా జాతీయ క్రీడా సమాఖ్యలకు రూ.7,386 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తూ కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాలశాఖ ఉత్తర్వులు జారీచేసింది. 2026-27 నుంచి 2030-31 మధ్య కాలంలో ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది.