- కేంద్ర ప్రభుత్వం 2026, మార్చి 5న 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. ఇప్పుడు నియమించిన 9 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు/ లెఫ్టినెంట్ గవర్నర్లలో అయిదుగురిని ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేసింది. ఒకరికి అదనపు బాధ్యతలు అప్పగించింది. ముగ్గుర్ని కొత్తగా నియమించింది.
- మైనార్టీ వర్గానికి చెందిన బిహార్ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌ఖాన్ పదవీకాలం ముగియడంతో ఆ స్థానాన్ని సయ్యెద్ అటా హస్నైన్‌తో భర్తీచేశారు.
- పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనందబోస్ మార్చి 5న తన పదవికి రాజీనామా చేశారు. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి పశ్చిమబెంగాల్‌కు బదిలీ అయ్యారు.