మన దేశంలో వ్యవసాయం, మత్స్య, పశు విజ్ఞానం (animal sciences), ఉద్యాన రంగాల్లో పరిశోధన, విద్యను నిర్వహించడానికి; మార్గనిర్దేశం చేయడానికి; సమన్వయానికి ఏర్పాటు చేసిన అత్యున్నత సంస్థే భారత వ్యవసాయ పరిశోధన మండలి (Indian Council of Agricultural Research - ICAR). ఇది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ వ్యవసాయ నెట్‌వర్క్‌లలో ఒకటి. భారత వ్యవసాయ పరిశోధన మండలి స్థాపనకు గుర్తుగా మన దేశంలో ఏటా జులై 16న ఐసీఏఆర్ వ్యవస్థాపక దినోత్సవంగా నిర్వహిస్తారు. వ్యవసాయ రంగంలో విద్య, పరిశోధన అంశాల్లో ఐసీఏఆర్ చేసిన విశేష కృషిని గుర్తించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం