Published on Nov 13, 2025
Current Affairs
ఐర్లాండ్‌ అధ్యక్షురాలిగా కేథరీన్‌ కొన్నోలి
ఐర్లాండ్‌ అధ్యక్షురాలిగా కేథరీన్‌ కొన్నోలి

ఐర్లాండ్‌ 10వ అధ్యక్షురాలిగా కేథరీన్‌ కొన్నోలి (68 ఏళ్లు) పదవీ బాధ్యతలు చేపట్టారు. మేరీ రాబిన్సన్, మేరీ మెక్‌ అలీస్‌ల తరవాత ఆ దేశానికి ఎంపికైన మూడో మహిళా ప్రెసిడెంట్‌ ఈమె. స్వతంత్ర వామపక్ష శాసన సభ్యులుగా పోటీచేసి ఆమె ఈ పదవికి ఎంపికయ్యారు. అధికార పార్టీ అభ్యర్థి హీథర్‌ హంప్రీస్‌ను 64 శాతం ఓట్లతో ఓడించారు. ఇంతవరకూ ఏ ప్రెసిడెంట్‌కీ ఇంత మెజారిటీ రాలేదు.