Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Aug 6, 2026
Current Affairs
ఏపీలో పెరిగిన ఎఫ్‌డీఐలు
ఏపీలో పెరిగిన ఎఫ్‌డీఐలు

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ రంగాల్లోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు) 2023-24తో పోలిస్తే 2025-26 నాటికి ఆరురెట్లు పెరిగినట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాలశాఖ మంత్రి జితేంద్రసింగ్‌ 2026, ఆగస్టు 5న లోక్‌సభలో వెల్లడించారు. మొత్తం 35 రంగాల్లోకి 2023-24లో 92.13 మిలియన్‌ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రాగా, 2025-26 నాటికి అవి 608.59 మిలియన్‌ డాలర్లకు చేరాయి. ఇందులో ఆహారశుద్ధి రంగంలోకి 2023-24లో 3.65 మిలియన్‌ డాలర్లు రాగా, 2025-26లో అవి 107.30 మిలియన్‌ డాలర్లకు పెరిగినట్లు చెప్పారు.