Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Nov 26, 2025
Current Affairs
ఏపీలో కొత్త జిల్లాలు
ఏపీలో కొత్త జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మూడు జిల్లాలు.. ఐదు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కాబోతున్నాయి. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దుల మార్పులు, చేర్పులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులను 2025, నవంబరు 25న సీఎం చంద్రబాబు ఆమోదముద్ర వేశారు.
  • దీంతో రాష్ట్రంలో జిల్లాలు 26 నుంచి 29కి, రెవెన్యూ డివిజన్లు 77 నుంచి 82కి పెరగనున్నాయి. మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా కొత్త జిల్లాలతోపాటు.. రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు పోలవరం పేరు నిర్ణయించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండ మండలం ఇకపై వాసవీ పెనుగొండగా మారనుంది.