Published on Oct 24, 2025
Government Jobs
ఎయిమ్స్ రాయ్‌పుర్‌లో జూనియర్‌ రెసిడెంట్‌ ఉద్యోగాలు
ఎయిమ్స్ రాయ్‌పుర్‌లో జూనియర్‌ రెసిడెంట్‌ ఉద్యోగాలు

రాయ్‌పుర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

వివరాలు:

జూనియర్ రెసిడెంట్ (నాన్-అకడమిక్) - 29 

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: అక్టోబరు 27వ తేదీ నాటికి 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

జీతం: నెలకు రూ.56100.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 27.10.2025, 

Website:https://www.aiimsraipur.edu.in/user/vacancies-desc.php?descscr=834&desctype=Advrt