18 ఏళ్లు పైబడిన వారందరి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘అసాంక్రమిక వ్యాధుల (ఎన్‌సీడీ) 4.0’ సర్వే నివేదిక 2026, నవంబరు 15న విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 18ఏళ్లు దాటిన జనాభా 4.28 కోట్ల మంది ఉండగా 59.63 లక్షల (13.93%) మంది రక్తపోటు(బీపీ), 48.95 లక్షల (11.44%) మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు తేలింది. సగటున ఏడుగురిలో ఒకరు బీపీ, తొమ్మిది మందిలో ఒకరు మధుమేహ వ్యాధిగ్రస్థులే. బీపీ, షుగర్ రెండింటితో బాధపడుతున్నవారు 34 లక్షల(7.94%) మంది ఉన్నారు.
2025, సెప్టెంబరు 17న విశాఖపట్నంలో సీఎం చంద్రబాబు ప్రారంభించిన ఎన్‌సీడీ-4.0 సర్వే 2026, నవంబరు 10న పూర్తయింది. సర్వేలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 2.85 కోట్ల మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తే కొత్తగా 12.23 లక్షల(4.29%) అధిక రక్తపోటు, 11.58 లక్షల (4.06%) మధుమేహం కేసులు బయటపడ్డాయి.