కర్ణాటక రాష్ట్రం మాల్పేలోని ఉడిపి కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (యూసిఎస్‌ఎల్)- సీఎస్‌ఎల్ ఒప్పంద ప్రాతిపదికన సూపర్‌వైజరీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 18
వివరాలు:
1. సూపర్‌వైజర్ (మెకానికల్)- 10
2. సూపర్‌వైజర్ (ఎలక్ట్రికల్)- 05
3. సూపర్‌వైజర్ (పెయింటింగ్)- 02
4. సూపర్‌వైజర్ (హెచ్‌ఎస్‌ఈ)- 01
అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో, ట్రేడులో ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
వయోపరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి 45 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు మొదటి ఏడాది రూ.40,650; రెండో ఏడాది రూ.41,490; మూడో ఏడాది రూ.42,355; నాలుగో ఏడాది రూ.43,246; ఐదో ఏడాది రూ.44,164.
ఎంపిక విధానం: రాత పరీక్ష, పవర్ పాయింట్ ప్రెజెటెంషన్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.300; ఎస్సీ/ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 12-05-2025.
Website:https://udupicsl.com/