Published on Oct 24, 2025
Government Jobs
ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో ఏసీఐఓ గ్రేడ్‌ II/ టెక్‌ ఉద్యోగాలు
ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో ఏసీఐఓ గ్రేడ్‌ II/ టెక్‌ ఉద్యోగాలు

భారత ప్రభుత్వం, హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటలిజెన్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌ II/ టెక్‌ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్‌ 25 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. 

వివరాలు: 

అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటలిజెన్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌ II/ టెక్‌: 258 పోస్టులు

1. కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషనల్‌ టెక్నాలజీ: 90

2. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌: 168

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌, పీజీ ఉత్తీర్ణతతో పాటు గేట్‌ (2023, 2024, 2025) ఉత్తీర్ణత ఉండాలి. 

వయోపరిమితి: 28.09.2025 నాటికి 18- 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు వయసులో సడలింపు వర్తిస్తుంది.

జీతం: నెలకు రూ.44,900- రూ.1,42,400.

వయోపరిమితి: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక విధానం: గేట్‌ స్కోర్‌, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా

దరఖాస్తు ఫీజు: యూఆర్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ పురుషులకు రూ.200; ఇతరులకు రూ.100. 

దరఖాస్తు ప్రారంభం: 25.10.2025

దరఖాస్తు చివరి తేదీ: 16.11.2025

Website:https://www.mha.gov.in/en