ఆసియా ఛాంపియన్‌షిప్‌లో జ్యోతి సురేఖ పసిడి ‘డబుల్’ సాధించింది. 2025, నవంబరు 13న ఢాకాలో జరిగిన మహిళల కాంపౌండ్ వ్యక్తిగత ఫైనల్లో జ్యోతి 147-145తో మరో భారత ఆర్చర్ ప్రీతిక ప్రదీప్‌ను ఓడించింది. అంతకుముందు సెమీస్‌లో జ్యోతి 149-143తో సి యు చెన్ (చైనీస్ తైపీ)పై నెగ్గింది. మహిళల టీమ్ తుదిపోరులో జ్యోతి, దీప్షిక, ప్రీతికలతో కూడిన భారత బృందం 236-234తో కొరియా (పార్క్ యెరిన్, యా హుయున్, జంగ్‌యూన్)ను ఓడించింది.
జ్యోతి ఇప్పటిదాకా 90 అంతర్జాతీయ పతకాలు గెలిచింది. ఇందులో 33 స్వర్ణాలు, 33 రజతాలు, 24 కాంస్యాలు ఉన్నాయి. ఆసియా ఛాంపియన్‌షిప్‌లో గెలిచిన వ్యక్తిగత పసిడి ఆమె కెరీర్‌లో 90వ పతకం.