రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు చెందిన హైదరాబాద్ మిస్సైల్ కాంప్లెక్స్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐ) డైరెక్టర్‌గా శాస్త్రవేత్త డాక్టర్ పి.శ్రీహరి 2026, సెప్టెంబరు 15న బాధ్యతలు చేపట్టారు. ఏలూరు జిల్లా కైకలూరు సమీపంలోని మండవల్లిలో ఆయన జన్మించారు. 1992లో బెంగళూరులోని ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఎల్‌ఆర్‌డీఈ)లో ‘బి’ శాస్త్రవేత్తగా వృత్తిని ప్రారంభించారు. లైట్ కాంబాక్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్‌సీఏ) కోసం మల్టీమోడ్ రాడార్ (ఎంఎంఆర్)పై పనిచేశారు.