Published on Oct 24, 2025
Current Affairs
ఆయుధాల కొనుగోళ్లకు ఆమోదం
ఆయుధాల కొనుగోళ్లకు ఆమోదం

త్రివిధ దళాల పోరాట సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడంలో భాగంగా రూ.79 వేల కోట్ల విలువైన ఆయుధాలు, సైనిక పరికరాలను కొనుగోలు చేసే ప్రతిపాదనలకు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) 2025, అక్టోబరు 23న ఆమోదం తెలిపింది. ఇందులో నాగ్‌ క్షిపణులు, ఉభయచర యుద్ధనౌకలు, ఎలక్ట్రానిక్‌ ఇంటెలిజెన్స్, నిఘా వ్యవస్థలు, తేలికపాటి అధునాతన టోర్పిడో (ఏఎల్‌డబ్ల్యూటీ)లు కూడా ఉన్నాయి.