ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ, డిజిటల్ మౌలిక వసతుల బలోపేతం కోసం అమెండెడ్ భారత్‌నెట్ ప్రోగ్రాం అమలు చేయడానికి కేంద్ర టెలికమ్యూనికేషన్‌శాఖ ఆధ్వర్యంలోని డిజిటల్ భారత్ నిధి, ఆంధ్రప్రదేశ్ భారత్‌నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బీఎస్‌ఎన్‌ఎల్, ఏపీ ఫైబర్‌నెట్ ఒప్పందం చేసుకున్నాయి.
2026, మే 13న దిల్లీలోని సంచార్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో అందుకు సంబంధించిన పత్రాలపై సంతకాలు చేశాయి. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ భారత్‌నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(ఏపీబీఐఎల్) అమలు చేస్తుంది.